Monday, June 2, 2008

Lyrics of Nuvvunte from film aarya in Telugu

నువ్వుంటే

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా

ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైనా ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
న్నువ్వుంటే నిజమేగా స్వప్నం
న్నువ్వుంటే ప్రతి మాటా సత్యం
న్నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
న్నువ్వుంటే ప్రతి అడుగు అందం
న్నువ్వుంటే ప్రతి క్షణమూ స్వర్గం
న్నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

పాట పాడదా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోటా చేయదా ప్రేమబాటలో పయనం
దారిచూపద శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిత్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
న్నువ్వుంటే ప్రతి ఆశా సొంతం
న్నువ్వుంటే చిరుగాలే గంధం
న్నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
న్నువ్వుంటే ప్రతి మాట వేదం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం

ఉన్నచోట ఉన్నానా ఆకశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీ వల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలే

2 comments:

Anonymous said...

hey sampath...greAT work... keep it up

sampath said...

thank you,your appreciation gives me more interesting in writing.