Tuesday, August 26, 2008

lyrics of naa manasuki song from the film aadavari matalaku arthaale verule

నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి

నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి

నా వయసుకి వంతెన వేసీ
నా వళపుల వాకిలి తీసీ
మది తెర తెరిచీ పకే పరిచీ ఉన్నావే లోకం మరిచీ


నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి

నీ చూపుకి సూర్యుడు చలువాయె
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయే మాయే

నీ అడుగుకి ఆకులు పువులాయె
నీ కులుకుకి కాకులు కవులాయె
నీ కలలకి నీ కథలకి
కదలాడె హాయెఏ హాయే

అందంగా నన్నే పొగిడీ
అటుపైనా ఏదో అడిగీ
నా మనసనే ఒక సరసులో అలజడులే సృష్టించావే

నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావె ప్రెమను పంచి

ఒక మాటా ప్రేమగ పలకాలె
ఒక అడుగూ జతపడి నడవాలె
ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం

ఒక సారి ఒడిలో ఒదగాలె
యద పైనా నిదరే పోవాలె
తీయ తీయనీ నీ స్మృతులతో బతికేస్త నిమిషం నిమిషం

నీ ఆశలు గమనించాలే
నీ ఆత్రుత గుర్తించలే
ఎటు తేలకా బదులీయకా మౌనంగా చూస్తున్నాలే

Saturday, August 16, 2008

Lyrics of the song Emaindi eevela from the film Aadavaari maatalaku arthaale verule

Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
yes

ఏమైందీ ఈ వేల
ఎదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేల
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పోయనేల

ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వెయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన వింత దాహం


చినుకులలో వానవిల్లు నేలకిలా జారెనే
తలుకుమనె ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసే తీగలగ న మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురే వస్తే

చిలిపి కనులు తాలమేసె
చినుకు తడికి చిందులేసె
మనసు మురిసి పాటపాడె
తనువు మరిచి ఆటలాడే

ఎదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేల
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పోయనేల



ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనె పెను మాయ చేసేనా
తన నడుము వొంపులోనె నెలవంక పూచెనా

కనుల యెదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచ
మొదటి సారీ మెరుపు చూసా
కడలిలగే వురకలెసా

Wednesday, August 6, 2008

చక్రం సినిమాలోని జగమంత కుటుంబం పాట

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదీ

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను సహగమిస్తు నాతో నేనె భ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రన్గవల్లుల్నీ కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదీ

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తు నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదీ

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హ్రుదయమే నా లోగిలి
నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి
నా హ్రుదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదీ